ముద్రలు |
1.బ్రొటన వ్రేలు -- అగ్ని ని సూచిస్తుంది.
2.చూపుడు వ్రేలు -- గాలి(వాయువు) ని సూచిస్తుంది.
3.మధ్య వ్రేలు -- ఆకాశం(శూన్యం) ని సూచిస్తుంది.
4.ఉంగరం వేలు --భూమి(పృద్వీ) ని సూచిస్తుంది.
5.చిటికెన వేలు -- నీటి(జలం) ని సూచిస్తుంది.
ఈ 5 అంశాలు మన శరీరం లో సమపాళ్ళలో ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం అని చెబుతున్నారు. ఈ 5 అంశాలో ఏ ఒక్కట్టి ఉండవలిసిన పాళ్ళలో లేకుంటే మనం శరీరం క్రమంగా వ్యాధులకు దారితీస్తుంది.
మన ఆరోగ్యం మన చేతుల్లో ?
ఈ 5 అంశాలలో ఏ లోపాలున్నా ఒక నిర్దిష్ట పద్ధతిలో మన చేతి వ్రేళ్ళను ఒకదానితో మరొకదానితో కనెక్ట్ చేయటం ద్వారా మనం ఆ అంశం బాలెన్సు చేసుకొన్ని తిరిగి ఆరోగ్యవంతులం కావచ్చును.మన చేతి వ్రేలతో చేసే ఈ ప్రక్రియను ముద్రలు అంటారు.
ఇప్పుడు కొన్ని ముద్రలు ఎలా చేయాలి వాటి వాళ్ళ ఉపయోగాలు చూద్దాం .
ముద్రల వలన ఉపయోగాలు:
1. ప్రాణముద్ర
1.ప్రాణముద్ర:
విధానం: ఉంగరపు వేలూ,చిటికెన వేలూ... రెండూ బొటనవేలు చివరను తాకుతూ ఉండగా మిగతా రెండు వేళ్ళు నిటారుగా ఉండాలి.
ప్రయోజనం :ఈ ముద్ర ప్రాణశక్తికి కేంద్రము. దీని వలన కంటిచూపు మెరుగు అవుతుంది.శరీరానికి కావలిసిన శక్తి కోసం ఈ ముద్ర అత్యంత లాభదాయకము.నిరోధకశక్తి అధికం అవుతుంది.
2. వాయు ముద్ర
2.వాయు ముద్ర :
విధానం: చూపుడు వ్రేలు కొనను మడచి దాన్ని బొటన వ్రేలు మొదట్లో ఉంచాలి.
ప్రయోజనం :మూత్ర సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు .
3. శూన్య ముద్ర
3.శూన్య ముద్ర:
విధానం:మధ్య వ్రేలును మడిచి పెట్టి ,దాని చివరను బొటనవ్రేలు మొదట్లో ఆనించాలి .
ప్రయోజనం :చెవి నొప్పి ,నత్తి తదితర సమస్యలున్న వారికి మంచి ఫలితాలోస్తాయి.
4. శుభరాత్రి ముద్ర
4.శుభరాత్రి ముద్ర :
విధానం:కుడి ,ఎడమ చేతుల వ్రేళ్ళను ఒకదానిలో ఒకటి జొప్పించి ,మడిచి బిగించాలి .
ప్రయోజనం : నిద్రలేమి నుంచి విముక్తి .
5. ఆది ముద్ర
5.ఆది ముద్ర:
విధానం:బొటన వ్రేలు ను మడిచి ,మిగతా నాలుగు వ్రేల్లును బొటన వ్రేలు మీద ఉంచాలి.
ప్రయోజనం :జ్ఞానేద్రియలకు ప్రాణ శక్తి ని ప్రసాదిస్తుంది. .రక్తపోటు తక్కువ ఉన్నవారు ఈ ముద్ర జోలికి వెళ్లకపోవటం మంచిది .
6.అగ్ని ముద్ర /సూర్యముద్ర
6.అగ్ని ముద్ర /సూర్యముద్ర :
విధానం: ఉంగరపు వ్రేలును మడిచి పెట్టి ,దాని కొనను బొటన వ్రేలు మొదట్లో ఆనించాలి .
ప్రయోజనం :చలి ప్రదేశాల్లో ఉన్నప్పుడు శరీరం లో వెచ్చదనం వ్యాపిస్తుంది. రక్తపోటు సమస్యలున్న వారికీ ఉపయుక్తం .
ముద్రలు ఎప్పుడు ఎక్కడ చేయవచ్చు ?
ఈ ముద్రల ద్వార మన ఆరోగ్యం మన చేతులో అనేది నిజమే అనిపిస్తుంది. కేవలం మన చేతి వేళ్ళు ఉపయోగించి ఈ ముద్రలను చాలా సులభంగా చేయవచ్చును.ముద్రలను రెండు చేతులతో చేయవలెను. ఎ పరిస్థితిలో ఉన్న వీనిని ఎప్పుడైన చేయవచ్చును.ఈ ముద్రలని మీరు ఏ సమయంలో అయీనా ,ఎక్కడ అయీనా చేయవచ్చును---ఉదాహరణకి బస్స్ లో,ట్రైన్లో,ఆఫీసులో ,ఇంటిలో,టీవీ చూసేటపుడు ఎపుడు అయీనా చేయవచ్చు.
మన ఆరోగ్యం కొరకు నమ్మకం ఉంచి ట్రై చేయండి పోయేది ఏమి లేదు.
మరికొన్ని ముద్రలు గురించి మనం తరువాత పోస్ట్ లో తెలుసుకుందాం .
మీకు తెలిసిన ముద్రలను కామెంట్ రూపం లో తెలియచేయండి .
Nice
ReplyDelete