మునక్కాయ, గుడ్డు కూర ఎలా చేయాలి?/How To Make Egg And Drumstick Curry


 

మునక్కాయ గుడ్డు కూర / Egg And Drumstick Curry




మన కూరగాయలో మునగ కాయకు చాలా ప్రత్యేకత ఉంది.మునగకాడల్లిని మన వంటల్లో చారు, సాంబారు, కూరవంటివెన్నో రకాల వంటకాలు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మునగకాడకు మరో హెల్తీ న్యూట్రీషియన్ ఫుడ్ జోడించి  చేస్తే మరి డబుల్ గా పోషకాలు శరీరానికి అందుతాయి.ఆ హెల్తీ న్యూట్రీషియన్  ఫుడ్ ఏమిటి అంటే అన్దేనడి మన కోడి గ్రుడ్డు. మునగకాడ, గుడ్డు కూర అద్భుతమైన రుచి, ఆరోగ్యం. ఈ రెండింటి కాంబినేషన్ లో తయారుచేసిన కూర  రైస్ లోకి అద్బుతంగా ఉంటుంది. ఈ వంటను ముఖ్యంగా సౌంత్ ఇండియాలో ఎక్కువగా తయారుచేసుకుంటారు. మరి దీన్ని ఎలా తయారుచేయాలో చూద్దాం....

Ingredients For Drumstick And Egg Curry Recipe/Egg and Drumstick Curry

కావల్సిన పదార్థాలు: 

1.గ్రుడ్లు:6

2.మునక్కాయలు:4

3.ఉల్లిపాయలు:2

4.పచ్చిమిర్చి:3

5.కారం:తగినంత

6.ఉప్పు:తగినంత

7.అల్లం వెల్లులి పేస్టు:టీ స్పూన్

8.గరం మసాలా పౌడర్:1/2 టీ స్పూన్

9.చింతపండు:చిన్న నిమ్మకాయ అంత

10.పసుపు: 1/4 టీ స్పూన్

11.నూనె: 3 టేబుల్ స్పూన్స్  

 12.కొత్తిమీర:కొద్దిగా

13.టమాటాలు:2 

14.తాలింపు గింజలు:కొద్దిగా

How To Make Drumstick Egg Curry Recipe ? Drumstick Egg Curry

తయారుచేయు విధానం:

1.గ్రుడ్లు ఉడికించి పెంకు వలచి పక్కన పెట్టాలి.తరువాత
2.మునక్కాయలు తగిన సైజులో ,ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా,పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా,టమాటాలు  సన్నని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టాలి.మరియు చింతపండు లో కొంచం వాటర్ వేసి నానాపెట్టుకోవాలి.తరువాత
3.స్టవ్ వెలిగించి  కూర చేసే పాన్ పెట్టి తగిన నూనె వేసి వేడి ఆయీన తరువాత ఉడికిన గ్రుడ్లకి అక్కడ అక్కడ గాట్లు పేటి వేడి అయినా నూనె లో వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.తరువాత

4. అదే పాన్ లో  మిగిలిన వేడి  నూనెలో తాలింపు గింజలు వేసి అవి వేగిన తరువాత  కరివేపాకు, పచ్చిమిర్చి ఉల్లిపాయ, టమోటో ముక్కలు వేసి  సన్నని మంట మీద వేగించుకోవాలి. 

5. ఉల్లి, టమోటో మెత్తగా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు పసుపు మరియు కారం వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.తరువాత
6.ఫ్రై అయిన తర్వాత పాన్ లో నూనె పైకి విడిగా త్రేలినపుడు అందులో ఒక గ్లాసు నీళ్ళు పోసి, మొత్తం మిశ్రమాన్ని కలియబెట్టుకోవాలి. తరువాత

7. అందులోనే మునగకాడల ముక్కలు వేసి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకూ ఉడికించుకోవాలి.తరువాత

 8. రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రేవి చిక్కబడి, మునగకాడలు మెత్తగా ఉడికిన తరువాత రోస్ట్  చేసిన గ్రుడ్లు   వేసి మొత్తం మిశ్రమం కలగలుపుకోవాలి .

9.గరం మసాలా పౌడర్1/2 టీ స్పూన్ మరియు చింతపండు పులుసు వేసి కొంచం సేపు సన్నని మంటపైన ఉడికించుకోవాలి. 
10.తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసి స్టవ్ ఆపు చేయాలి.

 అంతే డ్రమ్ స్టిక్ మరియు ఎగ్  కూర రెడీ.
ఇది వేడి వేడి అన్నంకు చాలా టేస్ట్ గా ఉంటుంది.

ఈ  మునక్కాయ గుడ్డు కూర మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాతో మరియు మీ మిత్రులతో షేర్ చేయండి.

                                    !!!!!!!!!!!!!!ధన్యవాదాలు!!!!!!!!!!!!!!!


 



No comments:

Post a Comment

నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .

మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు .