ముఖ సౌందర్యనికి టామాటో ??? టామాటో రసం తో ముఖవర్ఛస్సు!!!!


సాధారణ వంటకాల్లో వినియోగించే టమాటాలో ఆరోగ్యంతోపాటు సౌందర్యాన్ని పెంపొందించే ఎన్నో పోషకవిలువలు వుంటాయి. ఇందులో లైకోపిన్ అనే రసాయన పదార్థం వుంటుంది. ఇది చర్మాన్ని శుభ్రపరచడంలో, మెరుగుపర్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు.. ఈ టమోటాలో ఎన్నో సౌందర్యగుణాలు దాగివుంటాయి. ముడతలు ఏర్పడకుండా, చర్మరంధ్రాలును శుభ్రం చేయడం, వృద్ధాప్య లక్షణాలు రాకుండా.. ఇలా ఎన్నో సమస్యల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. ఇంకా ఇందులో ఎటువంటి బ్యూటీ లక్షణాలున్నాయో తెలుసుకుందామా...


1. గ్లోయింగ్ స్కిన్ : రాత్రి పడుకునే ముందు టమోటాను మధ్యకు కట్ చేసి ముఖానికి అప్లై చేయాలి. తర్వాత రోజు ఉదయం చల్లటి నీటితో శుభ్రంగా కడిగేస్తే చాలు.
2. మొటిమలు నివారణ : ముందుగా ఐస్ క్యూబ్ తో ముఖం మీద మర్దన చేయాలి. 15నిముషాల తర్వాత టమోటో ముక్కలతో ముఖం మీద మర్దన చేయాలి. ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. మొటిమలు మటుమాయం!
3. చర్మంను మెరిసేలా చేస్తుంది : అందుకు టమోటో రసంలో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇలా వారంలో రెండు రోజులు చేస్తే.. చర్మం మీద ఏర్పడ్డ మచ్చలు, చారలు తొలగి.. చర్మం కాంతివంతగా మారుతుంది.
4. చర్మం రంద్రాలు : టమోటోజ్యూస్ ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మ రంద్రాలు ముడుచుకుపోయేలా చేస్తుంది. చర్మ రంద్రాలు లేకుండా స్వచ్చంగా కనబడేలా చేస్తుంది.
5. జిడ్డును నివారిస్తుంది : టమోటోలో అసిడ్, ఆస్ట్రిజెంట్స్ వంటి రసాయనాలు వుంటాయి. ఇవి ముఖంలో జిడ్డును నివారిస్తాయి. అలాగే చర్మంలో నూనె ఉత్పత్తి తగ్గిస్తాయి.
6. బ్లాక్ హెడ్స్ ను నివారిస్తుంది : టమోటో రసంలో కొద్దిగా వాల్ నట్ పౌడర్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేస్తే.. అది బ్లాక్ హెడ్స్ శాశ్వతంగా నివారిస్తుంది.
7. చర్మంను తేమగా ఉంచుతుంది : టమోటో జ్యూస్ ముఖానికి అప్లై చేయడం వల్ల అది ముఖాన్ని తేమగా ఉంచతుంది.
సమీకరణ: తెలుగువిశేస్

No comments:

Post a Comment

నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .

మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు .