వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు తో ఇబ్బంది పడుతున్నారా?

       వయస్సుతో  సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు తో ఇబ్బంది పడుతున్నారా?                                                                                       image curtasy:youtube.com

     

మనలో అందరికి  ఏదో ఒక్క టైం లో మన జుట్టు తెల్ల పడుతుంది .కాని కొందరికి మాత్రం  20  ఏళ్లకే ,మరి కొందరికి 50 ఏళ్ళు వచ్చినా జుట్టు తెల్ల పడటం చూడం ఎందుకు ?ఈ తెల్ల జుట్టు వలన మనం మన వయస్సుకన్నా చాలా పెద్ద వారిలా కనిపించటం జరుగుతుంది .



తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది ?

మన జుట్టు మెలనిన్ అనే పిగ్మెంట్ కలిగి ఉంటుంది .మన శరీరం ఈ పిగ్మేంట్  ఉత్పత్తిని ఆపినప్పుడు మన జుట్టు సహజ రంగును కోల్పోయి రంగు మారిపోయి తెల్ల జుట్టు గా మారటం జరుగుతుంది .ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న వయస్సులోనే అందరికీ జుట్టు తెల్లబడి పోతుంది .మన వెంట్రుక కుదుల్లో   నూనె గ్రంధుల ఉత్పత్తి లేకపోవడం కూడా ఈ తెల్ల జుట్టుకు కారణం దీని వలన మన జుట్టు కు  సరియేనా పోషణ అందక మన జుట్టు తెల్లగా మారిపోతుంది .డైట్ కూడా మన జుట్టు తెల్ల పడటం లో  ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి, రాగి, ఇనుము మరియు అయోడిన్ ముఖ్యంగా లోపం వలన మన జుట్టు తెల్ల గా మారటానికి  ఒక రకం కారణమవుతుంది. కొన్ని సమయాల్లో, అధిక ఆందోళన మరియు ఆతురత   నుండి తెల్ల జుట్టు సంభవిస్తుంది.



తెల్ల వెంట్రుకలకు  కొన్ని కారణాలు:

 1.సైనసిటిస్
2.మెంటల్ ఆందోళనలతోపాటు
3.విటమిన్ బి కాంప్లెక్స్, ఇనుము, రాగి మరియు అయోడిన్ లోపం
4.వంశపారంపర్య కారకాలు
5.విద్యుత్ డ్రైయర్స్ ఉపయోగించుట
6.కేంద్రీకృతమై జుట్టు రంగులు ఉపయోగించుట
7.పోషకాహార లోపం
8.రక్తహీనత
9.హార్మోన్ల అసమతుల్యత
10.ఒత్తిడి మరియు యాంగ్జైటీ
11.కెమోథెరపీ మరియు రేడియేషన్
12.థైరాయిడ్ వ్యాధి
13.ఫోలిక్ యాసిడ్ లోపం మొదలినవి

 చిన్న వయస్సులో వచ్చే ఈ తెల్ల జుట్టును  ఎ విధంగా నిర్మూలించ వచ్చో తెలుసుకుందాం  రండి.

1.కరివేపాకు :  

కరివేపాకు 


      కరివేపాకును మనం రోజు చేసే కూరలో వేసుకోవటం వల్లనా తెల్ల జుట్టు రాకుండా చేసుకోవచ్చు .మనం ఇకనుంచి ఆయినా కూరలో కరివేపాకు వేరి పారేయకుండా  తినండి.

2.కరివేపాకు, కొబ్బరి నూనె ల మిశ్రమం:

image curtasy:youtube.com

కావలిసిన పదార్ధాలు':

1.తాజా కరివేపాకు 
2.కొబ్బరి నూనె 

తయారు చేయు విధానం :

1.కొబ్బరి నూనె లో  కొద్దిగా  తాజా కరివేపాకు  వేసి బాగా మరిగించాలి .
2.ఇప్పుడు కరివేపాకు రాకుండా   కొబ్బరి నూనె ను  వడ గటండి.
3. ఆ మిశ్రమాని బాగా  చల్లార నివండి .
4.చల్లారిన మిశ్రమమని మన కుదులకు బాగా అప్లై చేయండి .
5.20 నిమిషాల తరువాత  తల స్తానం చేయండి 
6. ఈ విధం గా వారానికి 2 సార్లు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది .ఈ మిశ్రమం జుట్టు నేరవకుండా ఉండటానికి చాలా సహాయ పడుతుంది . 

3.తాజా పండ్లు మరియు కూరగాయలు చాలా ఎక్కువగా తీసుకోవాలి 



ఈ  టిప్ ని   ట్రై చేసి ఎలా ఉందో నాతో మరియు మీ మిత్రులతో షేర్ చేయండి.

                                    !!!!!!!!!!!!!!ధన్యవాదాలు!!!!!!!!!!!!!!!






No comments:

Post a Comment

నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .

మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు .