చుండ్రు సమస్యా ?చుండ్రు నివారణ , చికిత్సకు ఉపకరించే కొన్ని చిట్కాలు! హోం రెమెడీస్

 చుండ్రు నివారణ , చికిత్సకు ఉపకరించే కొన్ని చిట్కాలు 


మన శరీరానికి కి సహజం గా అందం ఇచ్చేది కేశాలు. ఈ రోజులో కేశాల ఆరోగ్యాన్ని, అందాన్ని దెబ్బదీసే వాటిలో  చుండ్రు ప్రధానమైనది. వాతావరణ కాలుష్యం మూలంగా తలమీద చేరిన దుమ్ము, ధూళి, ఎండ కారణంగా పట్టే చెమట వంటివి ఈ చుండ్రుకు ప్రధాన కారణాలు.మన తల శుభ్రత కూడా ఒక్క కారణం . మరియు వానాకాలంలో తరచూ తడవటం, చల్లని వాతావరణంలో తిరగాల్సి రావటంతో ఈ సీజన్లో చుండ్రు సమస్య మామూలు కంటే కొంచెం ఎక్కువ గా ఉంటుంది .
చుండ్రు వలన కలిగే ఇబ్బందులు:

చుండ్రు కారణంగా దురద, చీకాకుతో బాటు జుట్టు రాలటం వంటి ఇబ్బందులు తప్పవు. ఈ సమస్యకు షాంపూల వంటి ప్రత్యామ్నాయాల కంటే గృహవైద్యమే మంచిది. చుండ్రు నివారణ , చికిత్సకు ఉపకరించే కొన్ని చిట్కాల గురించి తెలుసుకుందాం.

చుండ్రు నివారణ , చికిత్స కు హోం రెమెడీస్ :
  • పావులీటరు కొబ్బరి నూనెలో గుప్పెడుమందార పువ్వులేసి మరగబెట్టి చల్లార్చి తలకు రాసుకుంటే జుట్టు రాలటం ఆగుతుంది. చుండ్రు సమస్య కూడా దరిజేరదు.
  • అరకప్పు చొప్పున వేపాకు రసం, పెరుగు కలిపి అందులో చెంచా నిమ్మరసం వేసి తలకు పట్టించి గంట తర్వాత కుంకుడు రసంతో తలస్నానం చేస్తే చుండ్రు వదిలిపోతుంది.
  • గుప్పెడు మెంతుల పొడి, చెంచా నిమ్మరసం, 2 చెంచాల పెరుగు కలిపి రాత్రంతా నానబెట్టి ఉదయం తలకు పట్టించి గంటపాటు ఆరనిచ్చి తల స్నానంచేస్తే చుండ్రు తగ్గుతుంది.
  • తాజా కలబంద గుజ్జును తలకు పట్టించి గంట తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు నివారణ అవుతుంది.
  • గోరింటాకు ఫంగల్ ఇన్ఫెక్షన్ నివారణకు, జుట్టు కుదుళ్లను బలపరచేందుకు, చుండ్రు, జుట్టు రాలటాన్ని ఆపేందుకు మంచి మందు .
  • కుంకుడుగాయలు కొట్టి వేడినీళ్లలో వేసి, గుప్పెడు పచ్చి మందారం ఆకుల్ని కలిపి తల స్నానం చేస్తుంటే చుండ్రు వదిలి పోవటమే గాక తెల్ల వెంట్రుకల సమస్యా తగ్గుముఖం పడుతుంది.
  • అరలీటరు నీటిలో 20 ముద్ద మందార పువ్వులు వేసి 100 మిల్లీలీటర్లకు మరగనిచ్చి, ఆరిన తర్వాత వడపోసి, వారంపాటు రోజుకు చెంచా చొప్పున పేనుకొరికిన దగ్గర మర్దన చేసి తలస్నానం చేస్తే కొత్త వెంట్రుకలు వస్తాయి. 
మరికొన్ని బ్యూటీ టిప్స్ & హెయిర్ కేర్ టిప్స్  




                                                               # గమనిక #

ఈ http://alltipsintelugu.blogspot.com/ లో సూచించే సలహాలు ,సూచనలు ,కధనాలుమరియు టిప్స్అన్నీ ఇంటర్నెట్ లో సేకరించినవే,ఇవి అన్నీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే .వీటిని ఉపయోగించే ముందు మీ మీ ఆరోగ్యం మరియు ఇతర పరిస్థితులు పరిగణలోకి తీసుకోని మీ ఆరోగ్యం పరిస్థితి గురించి మీ డాక్టర్ గారి ని సంప్రదించి ,వారి సలహాలని ,సూచనలని తప్పక పాటించాలి .ఇక్కడ సూచించే సలహాలు సూచనలు వలన వచ్చే ఎలాంటి ఫలితాలతో ఈ http://alltipsintelugu.blogspot.com/ కి కానీ రైటర్స్ కి కానీ ఎలాంటి సంబంధం లేదు .అలాగే ఎవరు అన్నా కామెంట్ రూపం లో ఇచ్చే సలహాలు ,సూచనల ద్వార వచ్చే ఫలితాలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అది రీడర్స్ విజ్ఞతకే వదిలేస్తున్నాం.క్షమించమని మనసారా కోరుకుంటున్నాము.

No comments:

Post a Comment

నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .

మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు .