1.పచ్చి అరటిముక్కలు నల్లబడ కుండా ఈలా:
పచ్చి అరటి కూర చేయాలి అంటే అరటిముక్కలు కూర చేసే లోపే నల్లబడతాయి అనుకునేవారు ఈలా చేసి చూడండి.అరటికాయ ముక్కలుగా కోసేటప్పుడు తోలు తీసిన అరటికాయను మజ్జిగ కలిపిన నీళ్ళల్లో వేస్తే ముక్కలు నల్లబడవు.
2.పూరీలు మెత్తగా మరియు రుచిగా ఉండటానికి ఈ చిట్కా:
పూరి పిండి కలిపేటప్పుడు నీటికి బదులుగా పాలను కలిపితే పూరీలు మెత్తగానే కాకుండా రుచిగా కూడా ఉంటాయి.