చుండ్రు మరియు పేలను పూర్తిగా తగ్గించి ఒత్తైన జుట్టు కోసం చిట్కాలు.




                 ఈ రోజుల్లో మనలో ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంది ఈ చుండ్రు సమస్యతోనే.ఈ చుండ్రురావటానికి  కారణాలున్నాయి.

అవి జుట్టు శుభ్రంగా ఉండక పోవటం,వాతావరణ కాలుష్యం,జుట్టు కు తగినంత తేమ లభించకపోవటం. వారానికి సార్లు తలస్నానం చేయాలి.షాపూ లో ఎక్కువ కెమికల్స్ ఉండకుండా చూసుకోండి.

ఈ చిట్కాలని ట్రై చేయండి

1.అరకప్పు పెరుగు లో రెండు టేబుల్ స్పూన్ల పెసరపిండి కలిపి జుట్టుకి పట్టిస్తూ ఉంటే చుండ్రు నివారించబడుతుంది.



2.ఒక మగ్గు నీటిలో ఒక టీ స్పూను తాజా నిమ్మరసం కలిపి తలస్నానం అయ్యాక ఈ నీటితో జుట్టు కడుక్కుంటే చుండ్రు తాలూకు పొట్టు రేగడం తగ్గుపోతుంది.

3.మిరియాల పొడి, నిమ్మరసం కలిపి రాత్రి పూట తలకు పట్టించి ఉదయాన్నే స్నానం చేస్తే చుండ్రు పోతుంది.

4.మందారపూలను మెత్తగా నూరి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గిపోతుంది.

5. ఉల్లిపాయ రసం తలకు అప్లై చేయడం వల్ల , తలలో మూసుకుపోయిన రంద్రాలు తిరిగి తెరవబడతాయి.జుట్టు బలంగా పెరుగుతుంది.జుట్టు లో ఉన్న ఫంగస్ ని హరింపచేసి చుండ్రును నివారిస్తుంది. తెల్లజుట్టు నల్లగా మారుతుంది.ఉన్న జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. వారంలో 3 సార్లు ఉల్లిరసం తలకు పట్టిస్తే , రెండు నెలల్లో కొత్త జుట్టు రావడం గమనిస్తారు


1,4,5 చిట్కాలు అప్లయ్ చేసే విధానం:


 #. తలకు పట్టించి , మృదువుగా ఒక 5 నిముషాలు మసాజ్ చేయాలి.

 #. 45 నిముషాలు వెయిట్ చేసి , గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి.


తీసుకోవలిసిన జాగ్రత్తలు:


1) తల స్నానానికి హెర్బల్ షాంపూ మాత్రమే వాడాలి.

2) మానసిక ఆందోళన లేకుండా చూసుకోవాలి.

3) తీసుకొనే ఆహారంలో పోషకాలు ఉండేట్లు చూసుకోవాలి.

4) రోజులో కనీసం 3 లీటర్ల నీటిని త్రాగడం అలవాటు చేసుకోవాలి.


                    ఇలా చేస్తే అందమైన జుట్టు మన సొంతం.


ఇక.. మనలో చాలామంది పేలు బాధపెడుతుంటాయి వాటిని ఎలా నివారించవచ్చు  అంటే:

#.రాత్రి పూట దిండు మీద తులసి ఆకులు పెట్టుకుని పడుకుంటే తలలో పేలు తగ్గుతాయి.