మనలో రోగనిరోధకశక్తిని పెంచోకోవటానికి తప్పన సరిగా తీసుకోవలిసిన ఆహార పదార్ధాలు........

మన చుట్టురా నిరంతరం బోలెడన్ని హానికరమైన సూక్ష్మక్రిములు మన కంటికి కనపడకుండా తిరుగుతుంటాయి.అవి మన మీద మనకు తెలియకుండానే దాడి చేయవచ్చు.దీంతో రకరకాల ఇన్ఫెక్షన్, జబ్బుల బారిన పడవచ్చు.అయితే మనలో రోగనిరోధకశక్తి బలంగా ఉందనుకోండి అవేమీ చేయలేవు.వ్యాయామం, మంచి జీవనశైలి మాత్రమే కాదు,కొన్నిరకాల ఆహార పదార్ధాలు కూడా రోగనిరోధకశక్తి పుంజుకోవటానికి తోడ్పడతాయి.అలాంటివి కొన్ని పదార్ధాలేమిటో చూద్దాం. 






         

పుచ్చకాయ: లోపల ఎర్రటి గుజ్జుతో.. చూడగానే నోరూరించే పుచ్చకాయలో నీటిశాతం ఎక్కువ.ఇందులో గ్లుటదియోన్ అనే శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది, ఇది రోగనిరోధకశక్తిని పెంచి ఇన్ఫెక్షషన్స్, జబ్బులు రాకుండా కాపాడుతుంది.పై తొక్కు కు సమీపంలో ఉండే గుజ్జులో ఈ గ్లుటదియోన్ ఎక్కువగా ఉంటుంది కావున పుచ్చకాయని మనం పై తొక్కు కు దగ్గర వరకు తిని దాని లాభం పొందుదాం.


                                               
         

క్యాబేజీ: దాదాపు అన్నీకాలాల్లోను దొరికే క్యాబేజీ  లో ఉండే గ్లుటమైన్ రోగనిరోధకశక్తి పుంజుకోవటానికి ఎంతగానో తోడ్పడుతుంది, కావున దీనిని కూరగానో లేక సలాడ్ గానో  తరచుగా తీసుకోవటం అలవాటు చేసుకుంటే మంచిది.

  బాదంపప్పు:     పావుకప్పు బాదంపప్పును తింటే ఆరోజుకు అవసరమైన విటమిన్ మోతాదులో  సగం వరకు లభించినట్లే- ఇది నిరోధకశక్తి తగ్గకుండను కాపాడుతుంది- ఇక బాదంలలోని రైబోఫాక్టవిన్- నియాసిన్ వంటి బి విటమిన్లు ఒత్తిడి ప్రభావాల నుంచి బయటపడటానికి సాయపడతాయి.

 వెల్లుల్లి:   దీనిలో బోలెడన్ని యాంటిఆక్సిడెంట్ లు ఉంటాయి ఇవిఅన్నీ హానికరమైన క్రిములతో పోరాడేవే. ముఖ్యంగా జీర్ణాశయంలో పుండ్లు, క్యాన్సర్ కు కారణమయే  హెచ్ -  పైలోరీ బ్యాక్టీరియాను వెలుల్లి బాగా  ఎదుర్కుంటుంది.వెల్లుల్లి ని పొట్టు తీసి సన్నగా తరిగి  15 నిమిషాల తర్వాత వంటలో వాడితే రోగనిరోధకశక్తేని పెంపొ౦ది౦చే ఎంజైమ్లు బాగా ప్రేరేపితమవుతాయి. 

పాలకూర:ఇందులో  పోలేట్ దండిగా ఉంటుంది .ఇది కొత్త కణాలు –పుట్టుకురావడంలో,DNA మరమ్మతులో పాలు పంచుకుంటుంది పాలకూర  ద్వార పీచుతో పాటు విటమిన్ సి వంటి యాంటిఆక్సిడెంట్ లుయాన్ కూడా లభిస్తాయి. పాలకూరను బాగా కకడిగి, పచ్చిగా కానీ కాస్త ఉడికించి గాని తింటే మరింత మేలు.


చిలకడదుంప:  క్యారెట్ మాదిరిగానే చిలగదుంపల్లోనూ బీటా కెరొటిన్స బాగా ఉంటాయి- యాంటిఆక్సిడెంట్ లు గుణాలు గల ఇవి విశృంఖల కణాల ను౦చి ఎదురుయ్యే అనర్ధాలు నివారిస్తాయి.త్వరగా వృధ్యపం  రాకుండా చూసే విటమిన్ A  కూడా ఇందులో దండిగా ఉంటుంది.


పచ్చ గోభిపువ్వు: మన ఆరోగ్యాని  కాపాడే బోలెడన్ని పోషకాలు ఈ పచ్చ గోభిపువ్వులో (బ్రోకలీ) దండిగా ఉంటాయి.దీని ద్వార విటమిన్ ఏ,విటమిన్ సి, గ్లుటదియోన్  కూడా లభిస్తాయి- తక్కువకొవ్వుతో - కూడిన చీజ్  కలిపి బ్రోకలీని తింటే రోగనిరో ధకశక్తిని పెంపోదించే B విటమిన్లు ,విటమిన్ D కూడా పొందే అవకాశం ఉంది.


పెరుగు: రోజు ఒక్క కప్పు పెరుగు తింటే జలుబు బారినపడే అవకాశంతగ్గుతుంది. ఇది జబ్బులతో పోరాడే నిరోధకశక్తిని ప్రేరిపిస్తునట్లు అధ్యాయనాల్లో వెల్లడి అయింది. పెరుగులో విటమిన్ డి కూడా  ఉంటుంది. విటమిన్ D లోపం మూలంగా జలుబు,ప్లూ ముప్పు పెరుగుతునట్టు పరిశోధకులు గుర్తించారు కూడా.

No comments:

Post a Comment

నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .

మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు .