జింజర్ టీ తో జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోవచ్చు ?జింజర్ టీ తాగటం వలన ప్రయోజానాలు మరియు తయారు చేయు విధానము






జింజర్ టీ తాగటం వలన ప్రయోజానాలు:


జింజర్ టీతో జీర్ణవ్యవస్థను మెరుగుపరుచుకోండి అంటున్నారు... ఆరోగ్య నిపుణులు. జింజర్ టీ జీర్ణవ్యవస్థను ఉత్తేజపరుస్తుంది జింజర్ యాంటీ ఆక్సిడెంట్‌లతో నిండి ఉండి, తద్వారా శోషణ, ఆహార పోషకాల సమీకరణంలో కీలక పాత్రను పోషించి తద్వారా జీర్ణక్రియకు సహాయపడతాయి.

ఇది ఆహారంలో ఉండే ప్రోటీన్లను కూడా తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అజీర్తి లేదా ఎసిడిటీతో బాధపడుతుంటే తక్షణ ఉపశమనానికి ఒక కప్పు జింజర్ టీ తాగితే సరిపోతుంది. తరచూ వ్యాధుల బారిన పడకుండా  కాపాడుటకు రోగనిరోధకశక్తిని పెంచేందుకు జింజర్ టీ ఎంతగానో ఉపయోగపడుతుంది.

జింజర్ టీ తయారు చేయు విధానము :

ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని, కడిగి తొక్కు తీయండి. ఇప్పుడు, దానికి చిన్న ముక్కలుగా కోయండి లేదా తరగండి. ఈ జింజర్ ముక్కలను మరుగుతున్న ఒక కప్పు నీటిలో వేసి పది నిమిషాల తర్వాత తీసేస్తే జింజర్ టీ రెడీ అయినట్లే. జింజర్ టీని రోజుకో కప్పు తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 

సమీకరణ:వెబ్ ధునియ
image credits:casnellfitness

No comments:

Post a Comment

నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .

మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు .