పొట్ట తగ్గాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి?

పొట్ట దగ్గర కొవ్వు బాగా పెరిగితే అది వివిధ ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఉంటుంది, కానీ పొట్ట తగ్గించే ఫుడ్స్ వ్యాయామం కలుపుకుంటే అవి మీ పొట్ట తగ్గటానికి సహాయపడుతాయి. సాధారణంగా ప్రతి వ్యక్తి కొంత పొట్ట కలిగి ఉండాలి. ఒక ఆరోగ్యకరమైన శరీరానికి ముఖ్యమైన పోషకాలు కలిగి ఉన్న కొంత  కొవ్వు కావాలి. మన  శరీరం కణజాలం మరియు హార్మోన్లు బయోకెమికల్స్, సృష్టించడానికి కొవ్వు ఉపయోగాపడుతుంది. కొంత కొవ్వు మన చర్మం కింద ఉపరితలం దగ్గరగా ఉంది. మరికొంత  కొవ్వు  మన శరీరం లోపల గుండె, ఊపిరితిత్తులు మరియు కాలేయం చుట్టూ అవయవాలు చుట్టూ ఉంటుంది. ఈ అవయవాల చుట్టురా ఉన్న  కొవ్వు ఎక్కువ అయితే అది మన ఆరోగ్యం ప్రభావితం చేయవచ్చు .
ఎందుకు పొట్ట దగ్గర  కొవ్వు ప్రమాదకరమైనది?
 పొట్ట దగ్గర కొవ్వు ఎక్కువ గా ఉంటె పొట్ట మనకు "ఆపిల్" ఆకారం కనిపిస్తుంది. పొట్ట దగ్గర కొవ్వు బాగా ఎక్కువ  అయితే మనకు మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, స్ట్రోక్, కొన్ని రకాల కాన్సర్లు  అనేక ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుంది .  జన్యు సమస్యలు, అనారోగ్య జీవన విధానం మరియు వ్యాయామం లేకపోవడం వలన  పొట్ట దగ్గర ఎక్కువ కొవ్వు నిల్వ ఉంటుంది.. స్త్రీల కంటే పురుషులలో మరింత పొట్ట కొవ్వు నిల్వ ఉంటుంది. దీని వలన పురుషులు స్త్రీల కంటే ఎక్కువ గుండె జబ్బులు కలిగి ఉంటారు.రోజుకు 8గంటలు నిద్ర పోవాలి.తగినంత నిద్ర లేనివారు తదుపరి రోజు తక్కువ చురుకుగా ఉంటారు మరియు తక్కువ కేలరీలు ఖర్చు అయినట్టు తేలింది. కావున తప్పకుండా రోజుకు 8గంటలు నిద్ర పోవాలి.

ఏ ఆహారం తీసుకొంటే మనం పొట్ట కొవ్వును తగ్గించవచ్చు?

1.     ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి: రోజుకు 10 గ్రాములు కరిగే ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకోవటం వలన తక్కువ పొట్ట  కొవ్వు ఏర్పడుతుంది.ఈ ఫైబర్ బీన్స్, బఠాణి, వివిధ పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు మరియు వోట్స్ లో విరివిగా లభిస్తుంది. రోజంతా ప్రతి భోజనం మరియు అల్పాహారంలో కరిగే ఫైబర్ చేర్చి తినటానికి  ప్రయత్నించండి.తప్పకుండా రోజుకు కనీసం 6 నుండి 8 గ్లాసుల మంచినీళ్ళు తాగాలి.

2.     ప్రోటీన్లు ఉండే పదార్ధాలు: ప్రోటీన్లు ఉండే పదార్ధాలు తీసుకోవటం వలన మనకి ఫుడ్  పట్ల తృప్తి  జీర్ణం అవటానికి  సమయం పడుతుంది కావున మనకు ఆకలి అనిపించదు. తక్కువ కొవ్వు మరియు తక్కువ చక్కెర ,పెరుగు,  చేపలు, గుడ్లు, లేదా బీన్స్, బఠాణి, తృణధాన్యాలు, కాయలు మరియు గింజలు మరియు కొన్ని కూరగాయలు వంటి వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి.


3.     నీటి శాతం ఎక్కువగా ఉండే పదార్ధాలు:  నీటి శాతం ఎక్కువ ఉన్న ఆహారాలుకొంచం తీసుకొన్న మన పొట్ట తొందరగా నిడిపోతుంది.ఇది ప్రేగులో ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి. అనేక పండ్లు మరియు కూరగాయలు నీరు మరియు పోషకాల చాలా కలిగి ఉన్నాయి. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. పుచ్చకాయ లోఎక్కువ నీటి శాతం ఉంటుంది అందుకే పుచ్చకాయ తిన్నపుడు మన పొట్ట తొందరగా నిడిపోతుంది. నీటి శాతం ఇతర పండ్లు, బెర్రీలు, ద్రాక్షపండు, కర్బూజాలు, నారింజ, ఆపిల్, బేరి ల్లో ఎక్కువగా ఉంటుంది.ఇక   కూరగాయలు దోసకాయ, పాలకూర, ముల్లంగి, గుమ్మడికాయ, టమోటో, క్యాబేజీల్లో నీటి శాతం ఎక్కువ.

4.      కారం(స్పైసి) ఫుడ్:  కారంగా ఉన్నప్పుడు తక్కువ తినటం జరుగుతుంది

5.     మెటబాలిజం పెంపొందించే ఆహార పదార్ధాలు:గ్రీన్ టీ  మెటబాలిజం పెంపొందించే ఆహార పదార్ధాలలో ఒక్కటి.ఈ మెటబాలిజం పెరుగుటం వలన మనలో కొవ్వు నిల్వ తగ్గి బరువు ఈజీగా తాగుతాం.



No comments:

Post a Comment

నా బ్లాగ్ కు విచేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీకు నా బ్లాగ్ ఆర్టికల్స్ అన్నీ నచ్చినవి అనుకుంటునా .

మీ విలువైన సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియచేయగలరు .